ఎన్టిఆర్ జయంతి… నివాళులర్పించిన నారా కుటుంబం

SMTV Desk 2019-05-29 10:56:35  nara chadnrababu naidu, ntr ghat,

తెలుగు రాష్ట్రాలలో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్ జయంతి వేడుకలు అభిమానులు, టిడిపి కార్యకర్తలు ఘనంగా జరుపుకుంటున్నారు. టిడిపి కేంద్ర కార్యాలయానికి టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. ఎన్‌టిఆర్ జయంతి వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. హైదరాబాద్ లోని ఎన్‌టిఆర్ ఘాట్ దగ్గర ఎన్‌టిఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్‌టిఆర్ ఘాట్ వద్ద నారా బ్రాహ్మిణి, జూనియర్ ఎన్‌టిఆర్, నందమూరి కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు.