ప్రణబ్ ఆశీర్వాదాలు తీసుకున్న మోదీ

SMTV Desk 2019-05-29 10:48:47  pranab, Modhi,

రెండో సారి పార్లమెంట్ ఎన్నికలలో భారీ మెజార్టీ సాధించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. రెండో సారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న సందర్భంగా ప్రణబ్ ఆశీర్వాదాలు మోడీ తీసుకున్నారు. మోడీకి ప్రణబ్ స్వయంగా స్వీట్లు తీనిపించారు. ప్రణబ్ రాజనీతిజ్ఞుడు అని, ఆయనకు ఉన్న అపార అనుభవం భారతదేశానికి ఎంతో అవసరం ఉందని తెలియజేశారు. ఆయన దేశానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. లోక్ సభ ఎన్నికలలో ఎన్‌డిఎ 352 స్థానాలు గెలుచుకుంది. బిజెపి 303 స్థానాలు గెలుచుకోవడంతో ప్రాంతీయ పార్టీల అవసరం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ నెల 30న నరేంద్ర మోడీ రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.