ఇక థియేటర్స్ లో వరల్డ్ కప్.. ఫాన్స్ కు పండగే పండుగ

SMTV Desk 2019-05-29 10:46:06  Worldcup, Inox,

మ‌రో రెండు రోజుల్లో క్రికెట్‌ ప్ర‌పంచ క‌ప్ స‌మ‌రం ఆరంభం కానుంది. ఈ క్ర‌మంలోనే ఆ కప్‌లో పాల్గొనే జ‌ట్లు ఇప్ప‌టికే వార్మ‌ప్ మ్యాచుల‌తో బిజీగా ఉన్నాయి. ప్ర‌పంచ కప్‌లో ఏ టీంతో ఎలా ఆడాలి, జ‌ట్టు కూర్పు ఎలా ఉండాలి.. త‌దిత‌ర అంశాల‌న్నింటినీ ఆయా జ‌ట్లు బేరీజు వేసుకునే ప‌నిలో ఉన్నాయి. మ‌రోవైపు క్రికెట్ అభిమానులు మాత్రం త‌మ అభిమాన జ‌ట్లు ఆడ‌బోయే మ్యాచుల కోసం ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు.

కాగా భార‌త్‌లోని క్రికెట్ అభిమానుల కోసం ప్ర‌ముఖ మ‌ల్టీప్లెక్స్ సంస్థ ఐనాక్స్ ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ 2019 మ్యాచుల‌ను థియేట‌ర్ల‌లో పెద్ద తెర‌ల‌పై ప్ర‌సారం చేయ‌నుంది. ఇందుకు గాను ఇప్ప‌టికే ఐనాక్స్ ఐసీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో భారత్‌లో ఐనాక్స్ థియేట‌ర్ల‌లో ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచులు, అందులోనూ భార‌త్ ఆడబోయే మ్యాచులు ప్ర‌సారం కానున్నాయి. ఈ క్ర‌మంలో క్రికెట్ అభిమానులు భారీ తెరపై క్రికెట్ వినోదాన్ని వీక్షించ‌వ‌చ్చు.

మ‌న దేశంలో ఉన్న ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, పూణె, జైపుర్‌, ఇండోర్‌, వడోదర, సూరత్‌, నోయిడా, గూర్గావ్‌, ఫరీదాబాద్ త‌దిత‌ర న‌గ‌రాల్లోని ఐనాక్స్ థియేట‌ర్ల‌లో ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ 2019 మ్యాచ్‌ల‌ను పెద్ద తెర‌పై ప్రసారం చేయ‌నున్నారు. అయితే కేవ‌లం భార‌త్ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఆడ‌బోయే మ్యాచ్ లే కాదు, సెమీ ఫైన‌ల్‌, ఫైన‌ల్ మ్యాచులు కూడా ఈ భారీ తెర‌ల‌పై ప్ర‌సారం అవుతాయి. ఈ క్ర‌మంలోనే క్రికెట్ అభిమానులు భారీ తెర‌ల‌పై ఉత్కంఠ భ‌రితంగా, ఉత్సాహంగా.. మ్యాచుల‌ను వీక్షించ‌వ‌చ్చు..!