తండ్రి కొడుకులు అబద్దాలు చెప్పడంలో ఫస్ట్: వైసీపీ ఎమ్మెల్యే రోజా

SMTV Desk 2017-08-27 15:54:52  Roja, YSRCP, TDP, Chandrababu naidu, Kakinada Corporation polls, Nara Lokesh

కాకినాడ, ఆగస్ట్ 27: కాకినాడ నగరపాలక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ అధికార ప్రభుత్వంపై మండిపడ్డారు. చంద్రబాబు మాటలన్నీ అసత్యాలు, ప్రతీ బడ్జెట్‌లో కాపులకు వెయ్యికోట్లు కేటాయించినట్లు చెబుతున్నారు. అయితే ఇంతవరకు నాలుగు బడ్జెట్‌లు ప్రవేశపెట్టారు. ఆ లెక్కన కాపులకు నాలుగు వేల కోట్లు ఇచ్చి ఉండాలి. అది నిరూపిస్తే, రాజకీయాల నుంచి నేను శాశ్వతంగా తప్పుకుంటానంటూ ఆమె సవాల్ చేశారు. ఈ రాష్ట్రంలో టీడీపీ పదమూడేళ్లు అధికారంలో ఉండి కాపులకు చేసింది ఏమి లేదు. కాపులకు జరిగిన అభివృద్ధి అంతా వైఎస్ రాజశేఖర్ గారి హయాంలోనే జరిగింది. అందుకే, వైఎస్ బతికున్నంత కాలం కాపులు ఆయన వెన్నంటే ఉన్నారని ఆమె ఆరోపించారు. ఈ ఎన్నికల్లో వైసీపీదే విజయం ఆ విషయానికి నిన్న చంద్రబాబునాయుడి ప్రచారంలో మాటలే నిదర్శనం అంటూ ఆమె ధీమా వ్యక్తపరిచారు. కాపులకు తానే న్యాయం చేశానంటున్నారు అంతా అబద్దం... కళ్లు ఆర్పకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు, లోకేశ్‌లకు ఎవ్వరు సాటి లేరంటూ ఆమె ధ్వజమెత్తారు. మీకు ధైర్యం ఉంటే అగ్రిగోల్డ్ కేసును సీబీఐకి అప్పగించండి. అగ్రిగోల్డ్‌లో పుల్లారావు, లోకేశ్ ఎంత దోచుకున్నారో వాళ్లే లెక్కలు కక్కిస్తారు. వైసీపీ నేతలు దోచుకున్నారంటూ సిగ్గులేకుండా, పుల్లారావుగారు వైసీపీ నేతలపై బురదజల్లితే క్షమించేది లేదంటూ ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు.