సిలిండర్ పేలి ఎమ్మెల్యే, ఆయన భార్యకు గాయాలు

SMTV Desk 2019-05-28 17:15:28  cylinder blast,

సిలిండర్ పేలి ఎమ్మెల్యే గాయపడిన సంఘటన బిహార్ రాష్ట్రంలోని తారాపూర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎంఎల్‌ఎ మేవాలాల్ చౌదరీ, ఆయన సతీమణి మాజీ ఎంఎల్ఎ నీతా చౌదరీతో పాటు ముగ్గురు పని మనుషులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను భగల్‌పూర్ ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. గ్యాస్ లీక్ కావడంతోనే మంటలు చెలరేగాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. గాయపడిన వారిలో పనిమనుషుల పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించినట్టు సమాచారం.