పాండ్యాకు గాయం...వార్మప్ మ్యాచ్ కు దూరం

SMTV Desk 2019-05-28 17:13:31  hardik pandya

ప్రపంచకప్ టోర్నీ ముందు జరుగుతున్న వార్మప్ మ్యాచ్ లో నేడు టీంఇండియాకు బంగ్లాదేశ్ తో రెండో మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో టీంఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా దూరమయ్యాడు. వార్మప్ మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్‌లో సరదాగా పాల్గొన్న క్రికెటర్లు వికెట్లను టార్గెట్ చేస్తూ.. ప్రాక్టీస్ చేస్తున్నారు. అంతా చక్కగా జరుగుతుండగా హార్దిక్ పాండ్యా బ్యాట్ తీసుకుని స్పెషలిస్టులతో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. టీమిండియా ఫేసర్ వేసిన బంతి అదుపుతప్పి పాండ్యా ఎడమ మోచేతికి తగిలింది. దీంతో వెంటనే హార్దిక్ ప్రాక్టీస్ సెషన్‌ను వదిలేసి డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిపోయాడు. అతని గాయం తీవ్రతపై కానీ, అందుబాటులో ఉండలేకపోవడం గురించి గానీ, ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు.