లక్ష్మీపార్వతిపై టీడీపీ కార్యకర్తలు ఫైర్

SMTV Desk 2019-05-28 17:07:10  Tdp, Lakshmi Parvathi,

ఎన్‌టిఆర్ జయంతి వేడుకల్లో స్వల్పవాగ్వాదం చోటుచేసుకుంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్ జయంతి సందర్భంగా ఆయన భార్య లక్ష్మీ పార్వతి నివాళులర్పించేందుకు ఎన్టిఆర్ ఘాట్ కు వచ్చారు. లక్ష్మీ పార్వతి మాట్లాడుతుండగా టిడిపి కార్యకర్తలు అడ్డుతగిలారు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో చంద్రబాబు ఓటమితో ఎన్‌టిఆర్ ఆత్మ శాంతించిందని లక్ష్మీ పార్వతి వ్యాఖ్యనించింది. ఎన్‌టిఆర్ ఘాట్ వద్ద రాజకీయాలు మాట్లాడితే బాగుండదని లక్ష్మీ పార్వతికి టిడిపి కార్యకర్తలు, బాబు అనుచరులు వార్నింగ్ ఇచ్చారు. అభిమానులు ఆగ్రహంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. జై చంద్రబాబు, జైటిడిపి, ఎన్‌టిఆర్ అమర్ హై అంటూ నినాదాలు చేశారు. దీంతో లక్ష్మీ పార్వతి ఏమీ మాట్లాడకుండా వెనుదిరిగారు.