ధోనీ వైపు చూస్తే చాలు!

SMTV Desk 2019-05-28 17:03:23  kuldeep yadav, mahendra singh dhoni

టీంఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మహేంద్ర సింగ్ ధోనిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన కుల్దీప్...‘బౌలింగ్‌ సమయంలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ నుంచి నాకు సవాల్ ఎదురైతే..? వెంటనే ధోనీ వద్దకి వెళ్లిపోతాను. అతని వద్ద ప్రతి సమస్యకీ పరిష్కారం లభిస్తుంది. నేనే కాదు.. టీమ్‌లో ప్రతి ఒక్క బౌలర్‌ ధోనీని ఆశ్రయిస్తుంటారు. కొన్ని సమయాల్లో ధోనీ వైపు చూస్తే చాలు.. వెంటనే అతను అర్థం చేసుకుని దగ్గరికి వచ్చి మరీ సాయం చేస్తుంటాడు. వికెట్ల వెనుక నుంచి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ ఆటతీరుని పరిశీలించే ధోనీ.. ఏ ప్రదేశంలో బంతులు విసరాలో కూడా బౌలర్లకి చెప్తుంటాడు. చాలా సందర్భాల్లో అతని సలహాలు టీమ్‌కి వికెట్లుని అందిస్తుంటాయి’ అని వెల్లడించాడు.