జగన్ ప్రమాణానికి బాబు వస్తారా, లేదా?

SMTV Desk 2019-05-28 16:51:29  Jagan, Chandrababu,

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్ చేశారు. ఈ నెల 30వ తేదీన విజయవాడలో జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమానికి రావాలని జగన్ బాబును కోరారు.

ఇప్పటికే ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లను కలిసి, ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వానించిన జగన్.. మంగళవారం చంద్రబాబుకూ ఫోన్ చేసి ఆహ్వానించారు. 2014లో జరిగిన చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి జగన్ హాజరు కాలేదు. దీంతో జగన్ ప్రమాణానికి బాబు వస్తారా, లేదా అని చర్చ జరుగుతోంది.