కావాల్సింది సాధించే వరకు ధోనీ రిటైర్‌ అవ్వడు: షేన్‌ వార్న్

SMTV Desk 2019-05-28 16:47:50  mahendra singh dhoni, shane wanre

టీంఇండియా ఆటగాడు మహేందర్ సింగ్ ధోని రిటైర్మెంట్‌పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ షేన్‌ వార్న్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధోనీకి తాను ఎప్పుడు రిటైర్మెంట్‌ తీసుకోవాలో తెలుసు అని, ఈ విషయంపై విమర్శకులు పెద్ద రాద్ధాంతం చేయొద్దని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా వార్న్ మాట్లాడుతూ... భారత క్రికెట్‌కు ధోనీ మంచి సేవకుడు. భారత క్రికెట్‌కు కావాల్సిన ప్రతి ఒక్కటి అందజేశాడు. అయినా కొంతమంది ధోనీపై విమర్శలు చేయడం, ప్రపంచకప్‌ జట్టుకు ఎంపిక చేయవద్దని వ్యాఖ్యానించడం అర్ధరహితం. ఇలాంటి విమర్శలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. ధోనీ ఎందుకు రిటైర్‌ కావాలో విమర్శకులు చెప్పాలని ప్రశ్నించారు. ప్రతి ఒక్క ఆటగాడికి తాను ఎప్పుడు రిటైర్మెంట్‌ తీసుకోవాలో ఓ అవగాహన ఉంటుంది. అది ధోనీకి కూడా తెలుసు. రిటైర్మెంట్‌ ప్రపంచకప్‌ అనంతరమా? లేక మరో ఐదేళ్ల తర్వాతా? అనేది అతని ఇష్టమే. కావాల్సింది సాధించే వరకు ధోనీ రిటైర్‌ అవ్వడు. సరైన సమయంలో అతనే తప్పుకుంటాడు అని చెప్పుకొచ్చారు.