పవన్ కళ్యాణ్ కి 40 కోట్లు ఆఫర్ చేసిన బండ్ల గ‌ణేష్

SMTV Desk 2019-05-28 16:34:58  pawan kalyan

2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీకి నిరాశాజ‌న‌క‌మైన ఫ‌లితాలు వ‌చ్చాయి. మ‌ళ్లీ ఎల‌క్ష‌న్స్ అంటే ఐదేళ్లు ఆగాల్సిందే. మ‌రి అప్ప‌టి వ‌ర‌కు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏం చేస్తాడు? రాజ‌కీయాల్లోనే ఉంటారా? లేక సినిమా రంగం వైపు మొగ్గు చూపుతారా? అనే దానిపై ప‌లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

వ‌చ్చే ఎన్నిక‌లకు చాలా స‌మయం ఉండ‌టంతో ప‌వ‌న్‌ క‌ల్యాణ్ సినిమా ఫీల్డ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తార‌ని.. అందులో సందేహం లేద‌ని అంటున్నారు ప‌లువురు. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ఎప్పుడో అడ్వాన్సులు ఇచ్చిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు ఆయ‌న‌తో సినిమా చేయాల‌ని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాయి.

ఇప్పుడు మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి సినీ వ‌ర్గాల్లో చ‌క్క‌ర్లు కొడుతుంది. ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌తో సినిమా చేయాల‌ని బండ్ల గ‌ణేష్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌ట‌. ప‌వ‌న్‌కు 40 కోట్ల రూపాయ‌ల‌ రెమ్యునేష‌న్ కూడా ఆఫ‌ర్ చేశాడ‌ట‌. మ‌రి ద‌ర్శ‌కుడు ఎవ‌రనుకుంటున్నారు? మాస్ చిత్రాల‌ను తెర‌కెక్కించ‌డంలో దిట్ట అనిపించుకున్న బోయపాటి శ్రీను అని టాక్‌.

బోయపాటికి 10 కోట్ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ చేశాడ‌ట బండ్ల‌. రెమ్యున‌రేష‌న్స్ కాకుండా సినిమాను 50కోట్ల‌లో పూర్తి చేయాల‌నుకుంటున్నార‌ట‌. అంతా ఓకే అయితే త్వ‌ర‌లోనే క్రేజీ కాంబినేష‌న్‌లో సినిమా ఉంటుంద‌ని స‌మాచారం.