ఇంగ్లాండ్ కప్ గెలిచేలా ఉంది: మెక్‌గ్రాత్‌

SMTV Desk 2019-05-28 15:54:55  Former fast bowler Glenn McGrath

ఆస్ట్రేలియా మాజీ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్‌ ప్రపంచ కప్ టోర్నీలో ఫేవరెట్‌ జట్టు ఇంగ్లాండ్‌ అని, ఇంగ్లాండ్‌ ప్రస్తుత ఫామ్‌ చూస్తుంటే ప్రపంచకప్‌ గెలిచేలా ఉంది అని తాజాగా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... ఇంగ్లాండ్‌ మంచి వన్డే జట్టు. ఈ టోర్నీలో నా ఫేవరెట్‌ జట్టు ఇంగ్లాండే. ప్రస్తుత ఫామ్‌ చూస్తుంటే ప్రపంచకప్‌ గెలిచేలా ఉంది. ఈ మధ్య కాలంలో ఇంగ్లాండ్‌ ఆట నన్ను ఆకట్టుకుంది. భారీ లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు, అదే సమయంలో ఛేదిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో ఇంగ్లాండ్‌ పటిష్టంగా ఉంది. ఇక జట్టులో ఎక్కువగా ఆల్‌రౌండర్‌లు ఉండడం కలిసొచ్చే అంశం అని అన్నారు.