మెగాస్టార్ సరసన ఛాన్స్ కొట్టేసిన 'జెర్సీ' భామ

SMTV Desk 2019-05-28 15:49:43  shraddha srinath

తెలుగు తెరకి ఈ మధ్య కాలంలో పరిచయమైన అందమైన కథానాయికలలో శ్రద్ధా శ్రీనాథ్ ఒకరు. కన్నడలో ఆమె చేసిన యూ టర్న్ హిట్ కావడంతో అక్కడ ఈ సుందరికి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఆ సినిమాలో అమ్మడి సహజమైన నటనను చూసే, తెలుగులో జెర్సీ లో అవకాశం ఇచ్చారు. జెర్సీ సినిమా విజయవంతం కావడంతో, శ్రద్ధా ఇక్కడ కూడా నటన పరంగా .. గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది.

దాంతో ఈ అమ్మాయిని తమ సినిమాల్లోకి తీసుకోవడానికి దర్శక నిర్మాతలు ఆసక్తిని చూపుతున్నారు. ఆ జాబితాలో కొరటాల శివ కూడా కనిపిస్తున్నారు. చిరంజీవితో ఆయన ఒక సినిమాను రూపొందించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన సరసన ప్రధాన నాయికగా అనుష్క పేరును పరిశీలిస్తున్నారు. మరో కథానాయికగా శ్రద్ధా శ్రీనాథ్ ను ఎంపిక చేసే ఆలోచనలో వున్నారని తెలుస్తోంది.