మోదీ మాటలు.....నిజమైన వేళ!!

SMTV Desk 2019-05-28 15:45:49  modi

ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ తనతో 40 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా మండిపడ్డారు. అయితే, ఆ రోజు మోదీ ఊరికే ఆ మాటలు చెప్పలేదని ఇప్పుడు అర్థమవుతోంది. తాజాగా, తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న పళాన ఢిల్లీ వెళ్లడం సీఎం మమతను కలవరపాటుకు గురిచేస్తోంది.

ఆ ముగ్గురిలో ఒకరైన సుభాన్షు రాయ్ పై పార్టీ వ్యతిరేక వైఖరి కారణంగా అధినాయకత్వం ఆరేళ్ల నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో సుభాన్షు రాయ్ మరో ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీ వెళ్లారు. అక్కడ మోదీ, అమిత్ షాల సమక్షంలో వీరు కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు.