బ్రేకింగ్: 11 మంది జవాన్ల మృతి!

SMTV Desk 2019-05-28 15:30:57  jawans died

జార్ఖండ్ లో మావోయిస్టులు మరోమారు రెచ్చిపోయారు. సరాయ్ కెల్లా సమీపంలో వెళుతున్న భద్రతా సిబ్బంది కాన్వాయ్ లక్ష్యంగా శక్తిమంతమైన ఐఈడీ బాంబును పేల్చారు. ఈ తెల్లవారుజామున ఘటన జరుగగా, 11 మంది జవాన్లు మరణించారు. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. గాయపడిన వారిని చాపర్లలో రాంచీకి తరలించారు. స్పెషల్ ఆపరేషన్స్ లో భాగంగా వీరంతా ప్రయాణిస్తున్నారని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు. కాగా, రాష్ట్రంలో నక్సల్స్ కు వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమాలను అడ్డుకుని తీరుతామని ప్రకటించిన నక్సల్స్, గత వారం ముగ్గురు భద్రతా సిబ్బందిని కాల్చిచంపిన సంగతి తెలిసిందే.