ప్రజాప్రతినిధుల అండతోనే భూ దందా..

SMTV Desk 2017-06-03 14:56:33  ayyana pathrudu, ap ministar, vishaka patnam,

విశాఖపట్నం, జూన్ 3 : ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల అండదండలతోనే విశాఖ లో భూ దందా యథేచ్చగా కొనసాగుతోందని రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ మంత్రి అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. ప్రవాసాంధ్రులు ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్ముతో విశాఖలో భూములు కొనుగోలు చేస్తే భూ బకాసురులు వాటిని ఆక్రమించుకుంటూ వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారని చెప్పారు. విశాఖలో భూ దందా సాగుతోందంట కదా..రాజకీయ అండదండలుంటే ఎక్కడైనా సరే, ప్రభుత్వ భూములైనా దర్జాగా కబ్జా చేయుచ్చట కదా..మీరు కాస్త మద్దతుగా ఉంటే నేనో రెండెకరాలు ఆక్రమించుకుంటానంటూ ఓ స్నేహితుడు నన్నడిగారు. ఆయన మాటలు వింటుంటే విశాఖలో భూములు ఎంత ఈజీగా కబ్జా చెయెుచ్చొ అర్థమవుతోంది అని ఆయన వెల్లడించారు. విశాఖ ఉడా చిల్ర్డన్స్ థియోటర్ లో శుక్రవారం జరిగిన నవనిర్మాణ దీక్ష సభలో ఆయన మాట్లాడుతు ఆర్ అండ్ బి సిఇ గంగాధర్ 150 కోట్ల అక్రమాస్తులతో ఏసిబికి దొరికిపోయారని, ఒక సిఇ కి ఇంత సంపాదన అవసరమా అని ఆయన ప్రశ్నించారు. భూ దందాను బట్టబయలు చేసిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జెసి సృజన, పోలీస్ కమిషనర్ యోగానంద్ లను మంత్రి అభినందించారు.