జనసేనకు గుడ్‌బై చెప్పిన విశ్వం ప్రభాకర్ రెడ్డి !

SMTV Desk 2019-05-28 15:04:21  janasena, Vishwam Prabhakar reddy

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడంతో జనసేన పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఓటమి అనంతరం మీడియా ముందుకొచ్చి ముక్తసరిగా రెండు నిముషాలు మాట్లాడి వెళ్ళిపోయినా పవన్ ఇప్పటి వరకు బయటికిరాలేదు. కార్యకర్తల్ని, పోటీచేసిన అభ్యర్థుల్ని ఉద్దేశించి మాట్లాడటం కానీ, భవిష్యత్ కార్యాచరణ ఏమిటన్నది కానీ చెప్పలేదు. దీంతో అసలే ఓటమి బాధలో ఉన్న అభ్యర్థులు కొందరిలో అసహనం రేకెత్తి పార్టీని వీడేందుకు సిద్దపడుతున్నారు.

తాజాగా తంబళ్లపల్లె నియోజకవర్గ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన విశ్వం విద్యాసంస్థల అధినేత విశ్వం ప్రభాకర్ రెడ్డి తాను పార్టీకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీలో సరైన సహాయ సహకారాలు అందకపోవడం మూలానే పార్టీని వీడుతున్నట్టు ఆయన తెలిపారు. తన ఓటమికి కూడా అవే కారణాలని ఆయన చెబుతున్నారట. ఈయనలాగే ఇంకొంతమంది పార్టీని వీడకముందే పవన్ పార్టీ వ్యవహారాల్ని వేగవంతం చేసి నేతల్లో నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేస్తే మంచిది.