ప్రజలందరూ ప్రస్తుతం ఆయన చేతిలో సురక్షితంగా ఉన్నారు

SMTV Desk 2019-05-28 15:01:03  Modi, baba ramdev,

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ భారీ విజయం నమోదు చేసిన మే 23ను మోడీ దివాస్‌ జరుపుకోవాలని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ తెలిపారు. ఎన్నికల్లో కోట్లాది మంది ప్రజల నమ్మకంతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ గెలిచారని కొనియాడారు. మహాకూటమితో మోడీ ఒంటరిగా పోరాడారని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో పోరాడి ఉత్తరప్రదేశ్‌లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రజలందరూ ప్రస్తుతం ఆయన చేతిలో సురక్షితంగా ఉన్నారని దీంతో స్పష్టమైందని బాబా రాందేవ్‌ వ్యాఖ్యానించారు. తీవ్రస్థాయిలో శాసిస్తూ బీజేపీ ఎన్నికల్లో గెలిచిన మే 23ను మోడీ దివాస్‌ లేకుంటే లోకకల్యాణ్‌ దివాస్‌గా జరపాలని ఆయన వివరించారు.