ఆంధ్ర, తెలంగాణ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మోదీ

SMTV Desk 2019-05-28 14:48:51  Andhra, Telangana, Modi,

రెండోసారి ప్రధానిగా దేశం పగ్గాలు చేపట్టనున్న నరేంద్ర మోదీ ఈ రోజు కాశీలో సుడిగాలి పర్యటన చేశారు. తనను గెలిపించిన వారణాసి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నగరంలో బీజేపీ నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఏపీ విభజన అంశాన్నీ ప్రస్తావించారు.

తాను వారణాసి ప్రజలకు సేవకుడినని, వారి ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని చెప్పారు. గత ఐదేళ్లలో తమ ప్రభుత్వం చేసి చూపిన అభివృద్ధిని గమనించే ప్రజలు తమకు మరోసారి పట్టం గట్టారని పేర్కొన్నారు. ‘మా ప్రభుత్వం కోట్లాదిమంది పేదలకు మరుగుదొడ్లు నిర్మించింది. ఇళ్లు కట్టించింది. ఉచిత గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసింది. మా పార్టీ కార్యకర్తలు కూడా విజయం కోసం ఎంతో కష్టపడ్డారు…’ అని చెప్పారు.

తెలంగాణలో బీజేపీ నాలుగు సీట్లు సాధించిన నేపథ్యంలో ఆయన ఏపీ విభజన అంశంపై మాట్లాడుతూ.. ‘ఏపీ విభజన సరిగ్గా జరగలేదు. ఏపీ, తెలంగాణ ప్రజలు ఇప్పటికీ అశాంతితో జీవిస్తున్నారు. బీజేపీ జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్‌ను ఎలాంటి అశాంతీ లేకుండా విభజించింది. త్రిపురలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అక్కడ ప్రజాస్వామ్యం మెరుగుపడింది.. ’ అని చెప్పుకొచ్చారు.