రాహుల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాములమ్మ

SMTV Desk 2019-05-28 11:08:01  Rahul Gandhi, Vijaya shanthi,

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ పరాభవాన్ని చవిచూసింది. ఆ పార్టీ కేవలం 52 రాష్ట్రాలకే పరిమితమైంది. అధ్యక్షుడు రాహుల్ గాంధీ కంచుకోట అమేథీలో ఓటమిపాలయ్యారు. ఇన్ని పరాజయాలకు నైతిక భాద్యత తనదే అంటూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలనుకున్నారు. కానీ వర్కింగ్ కమిటీ దాన్ని తిరస్కరించింది. దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం రాహుల్ నిర్ణయాన్ని తోసిపుచ్చారు.

రాహుల్ గాంధీ తప్ప ఆ పదవిలో మరొకరు సరిపోరని, ఇంకొకర్ని ఊహించుకోలేమని వారంటున్నారు. కొంతమందైతే రాహుల్ రాజీనామా చేస్తే తాము కూడా రాజకీయాల నుండి తప్పుకుంటామని చెబుతున్నారు. వారిలో తెలంగాణ కాంగ్రెస్ నేత విజయశాంతి కూడా ఉన్నారు. గత ఐదేళ్లలో పార్టీకి రాహుల్ ఎంతో సేవ చేశారని, అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని పార్టీని ముందుకు నడిపారని, ఆయన అధ్యక్ష పదవిలో లేని పార్టీలో తనలాంటి ఎంతో మంది ఉండదల్చుకోలేదని చెప్పుకొచ్చారు.