శని దోషాలు పోవాలంటే ఇలా చేయండి

SMTV Desk 2019-05-28 11:00:22  shani doshalu,

ప్రతి ఒక్కరికి జీవితంలో కనీసం రెండు లేదా మూడుసార్లు ఏలినాటి శని వస్తుంది. దీంతో పాటు అర్ధాష్టమ శని, అష్టమశని బాధలు వస్తుంటాయి. అయితే నిజానికి శని వల్ల పడే బాధలు అంతా ఇంతాకావు. చాలామంది ఏపనిచేసినా సక్సెస్ కారు. అంతేకాదు తీవ్రమైన నష్టాలు, బాధలు, అవమానాలు ఇలా ఎన్నో వర్ణించలేని దుర్ఘటనలు. వీటన్నింటి నివారణకు చక్కటి పరిష్కారం కాలభైరవ ఆరాధన.

శని బాధలు ఉన్నవారు ప్రతిరోజు కాలభైరవాష్టకం రోజుకు వారి శక్తిని అనుసరించి 8 సార్లు చదువుకున్న తప్పక వారి బాధలు, శనిదోషాలు పోతాయి. ఒకవేళ ప్రతిరోజు చదవుకోవడానికి అవకాశం లేకుంటే కింది రోజుల్లో నెలకు ఒకసారి తప్పక కాలభైరవ ఆరాధన చేయండి.

వైశాఖమాసం- మే 27 –
జేష్ట్యం-జూన్ 25 –
ఆషాఢం- జూలై 25 -వటుక భైరవ అనుగ్రహం కలుగుతుంది
శ్రావణం- ఆగస్టు 24 – గురు అనుగ్రహం కలుగును
భాద్రపద- సెప్టెంబర్ 22 -శని దోషాలు తొలుగును
ఆశ్వీయుజ- అక్టోబర్ 20 – ఆయుష్షు పెరుగును
కార్తీకం – నవంబర్ 20 -మనశాంతి
మార్గశిరం- డిసెంబర్ 19 – కాలసర్పదోషాలు పోతాయి
పుష్యం- జనవరి 17 (2020) -శత్రుబాధలు పోతాయి
మాఘం- ఫిబ్రవరి 16 -భైరవుని అనుగ్రహం
ఫాల్గుణం- మార్చి 16 (2020)- వివాహ దోషాలు పోతాయి

పై రోజులను క్యాలెండర్‌లో గుర్తు పెట్టుకుని తప్పక కాలభైరవ ఆరాధన చేయండి. తప్పక మీ ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని దోషాలు పోతాయి.

ఇక ఆలస్యం ఎందుకు పైన చెప్పిన శాస్త్ర ప్రమాణాలను విశ్వాసంతో చేయండి సుఖసంతోషాలతో శనీశ్వరుడి అనుగ్రహాన్ని పొందండి.