ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో కరోలిన్ వోజ్నియాకి ఔట్

SMTV Desk 2019-05-28 10:56:32  Caroline Wozniacki

ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌, మాజీ వరల్డ్ నెంబర్ వన్ కరోలిన్ వోజ్నియాకి ఓటమిపాలయ్యింది. సోమవారం జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో ఆమె రష్యాకు చెందిన 68వ నెంబర్ క్రీడాకారిణి వెరోనికా కుడర్మెటోవా చేతిలో ఓటమి పాలైంది. నెదర్లాండ్స్‌కు చెందిన 13వ సీడ్ వోజ్నియాకి తొలి సెట్‌లో సునాయాసంగానే విజయం సాధించింది. కానీ తర్వాత రెండు సెట్లలో ఆమె ఎటువంటి పోరాటాన్ని ప్రదర్శించలేకపోయింది. దీంతో వోజ్నియాకి 0-6, 6-3, 6-3 స్కోర్‌తో వెరోనికా చేతిలో ఓడిపోయింది. రెండవ సెట్‌లో వోజ్నియాకి 10 అనవసర తప్పిదాలు చేసింది. పారిస్‌లోని రోలాండ్ గారోస్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది.