కొరటాల శివ డైరెక్షన్ లో మెగా పవర్ స్టార్ .. ఇక రచ్చ రచ్చే

SMTV Desk 2019-05-27 18:35:42  Koratala SHiva, ram charan,

సక్సెస్ ఫుల్ రైటర్ గానే కాదు సక్సెస్ ఫుల్ డైరక్టర్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు కొరటాల శివ. మిర్చి నుండి భరత్ అనే నేను సినిమా వరకు వరుస హిట్లు కొడుతున్న కొరటాల శివ తన తర్వాత సినిమా మెగాస్టార్ చిరంజీవితో చేస్తాడని తెలుస్తుంది. చిరంజీవి సైరా సినిమా పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కుతున్న సైరా సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి కావాల్సి ఉన్నా కొన్ని సీన్స్ రీ షూట్స్ వల్ల లేటవుతూ వచ్చింది.

కొరటాల శివ చిరంజీవి సినిమా తర్వాత ఆ వెంటనే రాం చరణ్ సినిమా కూడా ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం రాజమౌళి డైరక్షన్ లో ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు రాం చరణ్. ఈ సినిమా తర్వాత కొరటాల శివ డైరక్షన్ లో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడట. స్క్రిప్ట్ ఓకే చేసుకోగా సినిమాలో హీరోయిన్స్ గా కాజల్, రకుల్ ఇద్దరు నటించే ఛాన్సులు ఉన్నాయట. కొణిదెల ప్రొడక్షన్స్ లోనే కొరటాల శివ చిరు సినిమాతో పాటుగా రాం చరణ్ సినిమా కూడా నిర్మితమవుతుందట.