రెడ్డి గారి అబ్బాయి

SMTV Desk 2019-05-27 18:35:00  Mahesh babu,

సూపర్ స్టార్ మహేష్ మహర్షి హంగామా దాదాపు ముగిసినట్టే కనిపిస్తుంది. మహేష్ 25వ సినిమాగా వచ్చిన మహర్షి అనుకున్న విధంగానే సక్సెస్ అందుకుంది. ఇక త్వరలోనే అనీల్ రావిపుడి డైరక్షన్ లో సినిమా షురూ చేస్తున్నాడు మహేష్. ఈ సినిమాకు టైటిల్ గా రెడ్డి గారి అబ్బాయి అని పెడుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే అంతకుముందే ఈ సినిమాకు సరిలేరు నీకెవ్వరు టైటిల్ పెడుతున్నట్టుగా వార్తలు వచ్చాయి.

ఇప్పుడు ఇదే టైటిల్ ఫైనల్ అయినట్టుగా తెలుస్తుంది. దిల్ రాజు, అనీల్ సుంకర కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. పటాస్ నుండి ఎఫ్-2 వరకు వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న అనీల్ రావిపుడి సూపర్ స్టార్ మహేష్ తో చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. జూన్ సెకండ్ వీక్ లో మొదలుపెట్టి 2020 సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు దర్శక నిర్మాతలు.