మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

SMTV Desk 2019-05-27 18:24:21  modi

నరేంద్ర మోదీ ఈ నెల 30న రెండో సారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. అదే రోజున విజయవాడలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్న విషయం తెలిసిందే. ఉదయం జరగనున్న ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పాల్గొననున్నారు. అనంతరం ఇద్దరు సీఎంలు ఢిల్లీ వెళ్లనున్నారు.