రాజధాని ఎక్స్ ప్రెస్ లో డ్రగ్స్ కలకలం

SMTV Desk 2019-05-27 18:08:14  Rajadhani express, druges

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఢిల్లీలో సోమవారం ఉదయం విస్తృతంగా సోదాలు చేశారు. ఈ క్రమంలో భారీగా డ్రగ్స్‌ను సీజ్ చేశారు. పట్టుబడిన ఈ డ్రగ్స్ విలువ సుమారు. రూ. 25 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. పట్టబడిన డ్రగ్స్ లో 5 కిలోల హీరాయిన్, 2.6 కిలోల కొకైన్ ఉందని వారు చెప్పారు. ముంబయి నుంచి ఢిల్లీకి రాజధాని ఎక్స్ ప్రెస్ లో ఈ డ్రగ్స్ ను తరలిస్తుండగా పట్టకున్నామని వారు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇద్దరు నైజీరియన్లతో పాటు ఓ ఉగండా దేశస్థురాలిని అరెస్టు చేశామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని వారు వెల్లడించారు.