సిక్కిం సిఎంగా ప్రేమ్‌సింగ్ త‌మాంగ్ ప్ర‌మాణ స్వీకారం

SMTV Desk 2019-05-27 18:03:42  Sikkim chief minister, Prem Singh Tamang Sworn As Sikkim CM On Monday

గ్యాంగ్ టక్ : సోమవారం ఉదయం సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రేమ్‌సింగ్ త‌మాంగ్ (51) ప్ర‌మాణ స్వీకారం చేశారు. గ‌వ‌ర్న‌ర్ గంగా ప్ర‌సాద్ ప్రేమ్ సింగ్ చేత ప్ర‌మాణ స్వీకారం చేయించారు. గ్యాంగ్‌ట‌క్‌లోని ప‌ల్జోర్ స్టేడియంలో సిఎం ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. సిక్కిం క్రాంతికారి మోర్చా అభిమానులు , మద్ధతుదారులు ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున తరలివచ్చారు. త‌మాంగ్ నేపాలీ భాష‌లో ప్ర‌మాణ స్వీకారం చేశారు. సిక్కిం అసెంబ్లీలో మొత్తం 32 స్థానాలు ఉన్నాయి. ఎస్ కెఎం, ఎస్ టి ఎఫ్‌ పార్టీలు ఎన్నికల్లో హోరాహోరీ పోరుకు పాల్పడ్డాయి. అయితే గురువారం అర్ధరాత్రి వరకు జరిగిన ఓట్ల లెక్కింపులో ఎస్ కెఎం 17 స్థానాల్లో విజయం సాధించింది. ఎస్ టి ఎఫ్‌ 15 స్థానాలతో సరిపెట్టుకుంది.