ఫార్ములావన్‌ ప్రపంచ ఛాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌

SMTV Desk 2019-05-27 17:59:33  Lewis Hamilton

వరుసగా ఐదో సారి మొనాకో గ్రాండ్‌ ప్రి విజేతగా మెర్సిడస్‌ స్టార్‌ డ్రైవర్‌, లూయిస్‌ హామిల్టన్‌ నిలిచారు. ఉత్కంఠగా సాగిన రేసులో సెకను కన్నా తక్కువ సమయంలోనే ప్రత్యర్ధిని వెనక్కినెట్టి టైటిల్‌ సంపాదించాడు. రేసును గంటా 43 నిమిషాల 28.437 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించాడు. సెబాస్టియన్‌ వెటల్‌ రెండో స్థానంలో నిలిచాడు. వాల్తేరి బొటాస్‌ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ విజయంతో ఎఫ్‌-1 డ్రైవర్ల జాబితాలో హామిల్టన్‌ 137 పాయింట్లు సొంతం చేసుకుని మెరుగైన స్థానంలో నిలిచాడు.