లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్సే ఆదుకోవాలి!

SMTV Desk 2019-05-27 17:58:34  virat kohli

ప్రపంచకప్ ముందు శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో టీంఇండియా పరాజయపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ..ఇంగ్లాండ్‌ పిచ్‌లపై కొన్నిసార్లు టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ పరుగులు చేయకపోతే, ఆ సమయంలో లోయర్‌ ఆర్డర్‌ ఆదుకుని మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లాలి. అందకు వారు ఎప్పుడూ సిద్దంగా ఉండాలని సూచించారు. వార్మప్‌ మ్యాచ్‌లో హార్ధిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, ఎంఎస్‌ ధోని ఒత్తిడిని తట్టుకుని నిలబడ్డారు. ఇది జట్టుకు లాభించే అంశమేనని కోహ్లి అన్నారు.