ఏజెన్సీ చేతిలో మోసపోయిన భారతీయులకు అండగా నిలిచిన భారత ఎన్నారై

SMTV Desk 2019-05-27 17:43:09  Kuwaiti agency, Indians, Kuwait- 35 Indians cheated by recruiting agent

కువైట్: అనేక మంది భారతీయులు కువైట్ వీసా విషయంలో ఏజెన్సీల చేతిలో మోసపోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే జరిగిన ఓ ఘటన మరో సారి ఏజెన్సీల కుట్రల్ని బయటపెట్టింది. ఓ ఏజన్సీ చేతిలో మోసపోయిన భారతీయులని ఢిల్లీ కి చెందిన ఓ ఎన్నారై ఆడుకున్నారు. వారికి అండగా ఉంటానని ముందుకొచ్చారు.ఓ ఏజెన్సీ సంస్థ చేతిలో మోస పోయిన భారతీయులని ఆదుకోవడానికి ఢిల్లీ కి చెందిన వ్యాపారవేత్త ఆకాష్ ముందుకు వచ్చారు. వారికి ఉండటానికి వసతిని కల్పించారు.ఈ సమస్య పరిష్కారం అయ్యేవరకూ వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఒకే దేశానికి చెందిన వారికి సహాయం చేయలేకపోతే మేము అక్కడ ఉన్నా ఉపయోగం లేదని ఆయన చెప్పడం మోస పోయిన వారిని కదిలించింది.ఎనాస్కో అనే కంపెనీ ద్వారా యువత కువైట్ కి వచ్చినట్టుగా ఇండియన్ ఎంబసీ తెలిపింది. కువైట్ ఇండియన్ ఎంబసీ సెక్రటరీ సిబీ ఈ విషయాలని వెల్లడించారు. ఇప్పటి వరకూ సదరు ఏజెన్సీ పై 74 కేసులు నమోదు అయ్యాయని అన్నారు సిబీ. ఆ కంపెనీ ఇప్పటికే బ్లాక్ లిస్టు లో ఉందని అయినా ఎంతో మందిని మోసాలు చేస్తూ వస్తోందని అన్నారు. త్వరలోనే వీరిని స్వదేశానికి పంపే ఏర్పాటు చేస్తామని సిబీ తెలిపారు. యువతకి అండగా ఉన్న ఆకాష్ కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.