కారు కొనుకునే వారికి చేతిలో సరిపడా డబ్బులు లేక బ్యాంకులో రుణాలు తీసుకుందామని చూస్తారు. దీనికి ముందు ఏ బ్యాంకులో ఎంత వడ్డీ రేటుకి రుణాలను ఆఫర్ చేస్తోందో తెలుసుకోవాలి. ఎస్బీఐ: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ ఇది. ఈ బ్యాంక్‌లో జనరల్ కారు లోన్‌పై రుణ రేట్లు 9.45- 9.95 శాతం శ్రేణిలో ఉన్నాయి. అలాగే ఈ బ్యాంక్ ప్రిఓన్డ్ కార్ లోన్స్ కూడా ఆఫర్ చేస్తోంది. వీటిపై రుణ రేటు 11 శాతం నుంచి 12 శాతం శ్రేణిలో ఉంది. అలాగే ఈ బ్యాంక్ ఎస్బీఐ కార్ లోన్ లైట్ ఆప్షన్ అనే మరో స్కీమ్‌ను అందిస్తోంది. ఇందులో వడ్డీ రేటు 11.6 శాతం నుంచి 12.6 శాతం శ్రేణిలో ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్: కొత్త కారు కొనుగోలుకు ఈ బ్యాంక్‌లో వడ్డీ రేట్లు 12.85 శాతం నుంచి ప్రారంభమౌతోంది. 23 నెలల నుంచి 35 నెలల కాలానికి ఈ రేటు వర్తిస్తుంది. అదే 36 నుంచి 84 నెలల కాలానికి అయితే వడ్డీ రేటు 9.3 శాతంగా ఉంది. అదే మీరు పాత కారు కొనుగోలుకు రుణం తీసుకోవాలని భావిస్తే అప్పుడు రుణ రేటు 14.25 శాతంగా ఉంది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్: ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ ఇది. కారు లోన్‌పై ఈ బ్యాంక్‌లో వడ్డీ రేటు 9.75 నుంచి 10.60 శాతం శ్రేణిలో ఉంది. ఈఎంఐ చెల్లింపుల్లో జాప్యం జరిగితే నెలకు 2 శాతం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.