ముస్లింలపై అంత ప్రేముంటే.....వారికి ఎన్ని ఎంపీ సీట్లు ఇచ్చారు?

SMTV Desk 2019-05-27 16:20:20  owaisi

ప్రధాని నరేంద్ర మోదీపై మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో ముస్లింలు భయపడుతున్నారని మోదీ చెప్పడంపై మాట్లాడుతూ.. యూపీలో అఖ్లాక్ ను కొట్టి చంపిన అల్లరి మూకపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. మోదీకి నిజంగా ముస్లింలపై ప్రేమ ఉంటే ఎంతమందికి లోక్ సభ టికెట్లు ఇచ్చారని నిలదీశారు.

"ముస్లింలు భయపడుతున్నారని మోదీ అంటున్నారు. మరి గోవు పేరుతో హత్యలు చేయడాన్ని మోదీ ఎందుకు నివారించడం లేదు? మూక దాడులకు ఎందుకు ముకుతాడు వేయడం లేదు? ముస్లింలను కొడుతూ వీడియోలు తీసి వేధిస్తున్న వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? ముస్లింలపై మోదీ ప్రేమ చూపిస్తున్నారు. మరి బీజేపీ గెలిచిన 300 లోక్ సభ సభ్యుల్లో ముస్లింలు ఎంత మంది ఉన్నారో చెప్పండి? మోదీ విధానం ఏంటో ఈ ఐదేళ్ల పాలన చూసి అర్థం చేసుకోవచ్చు" అని ఒవైసీ ప్రశ్నించారు.