ఆగని ఇంధన ధరల మంట

SMTV Desk 2019-05-27 15:51:31  Petrol, Deseal, Price, New delhi

నేటితో వరుసగా ఐదు రోజుల నుండి దేశీయ ఇంధన ధరలు పెరుగుతూ వస్తున్నాయి. సోమవారం కూడా పెట్రోల్ ధర 11 పైసలు పైకి కదలగా డీజిల్ ధర మాత్రం నిలకడగా కొనసాగింది. దీంతో హైదరాబాద్‌‌లో పెట్రోల్ ధర రూ.76.12కు చేరింది. డీజిల్ ధర రూ.72.47 వద్ద స్థిరంగా ఉంది. దేశంలోని ఇతర నగరాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర కేవలం ఒకే ఒక పైసా పెరుగుదలతో రూ.71.77కు చేరింది. డీజిల్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. రూ.66.64 వద్ద కొనసాగుతోంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా ధరలు పెరిగాయి. పెట్రోల్ ధర 10 పైసలు ఎగసింది. డీజిల్ ధర నిలకడగా ఉంది. దీంతో పెట్రోల్ రూ.77.38కు చేరితే.. డీజిల్ ధర రూ.69.83 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర 10 పైసలు పెరుగుదలతో రూ.75.86కు చేరింది. డీజిల్‌ ధర రూ.71.82 వద్దే కొనసాగుతోంది. ఇక విజయవాడలో పెట్రోల్ ధర రూ.75.51కు పెరిగింది. డీజిల్ ధర రూ.71.50 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా కదిలాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.19 శాతం పెరుగుదలతో 67.60 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.36 శాతం తగ్గుదలతో 58.60 డాలర్లకు క్షీణించింది.