చంద్రబాబుపై హీరో మంచు విష్ణు పంచ్

SMTV Desk 2019-05-27 13:35:14  manchu vishnu, Chandrababu

ఏపీలో ఫ్యాన్ దెబ్బకు సైకిల్ నిలవలేకపోయింది. ఏపీ వ్యాప్తంగా వైసీపీ ఊపుకి టీడీపీ ఘోర పరాజయంపాలయ్యింది. వైసీపీ ఏకంగా 151 సీట్లు గెలుచుకోగా టీడీపీ 23 దగ్గరే ఆగిపోయింది. ఇంతటి భారీ ఓటమిని ఊహించని టీడీపీ నేతలు షాక్‌లోనే ఉన్నారు. అయితే వారు ఓడిన బాధలో ఉంటే, వైసీపీ భజన బ్యాచ్ మాత్రం పండగ చేసుకుంటూ బాబుని, టీడీపీని ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు. అదే క్రమంలో తాజాగా చంద్రబాబుపై హీరో మంచు విష్ణు పంచ్ పేల్చారు.. బాబుపై సెటైర్లు పేలుస్తూ ట్వీట్ చేశారు. ట్వీట్‌లో ‘నారా (NARA)అంటే.. N-జాతీయ స్థాయిలో(National) A-ఆశయం(Ambition).. R-ప్రాంతీయ స్థాయిలో(Regional) A-ఆకాంక్షలు(Aspirations).

నాకు బలమైన భావన ఉంది.. మన ప్రియమైన ప్రధాని నరేంద్ర మోదీజీ ఎవర్ని ఇలా ట్రోల్ చేశారో.. మనకూ తెలుసు’ అంటూ బాబుని ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఏపీ ఎన్నికలకు ముందు మంచు ఫ్యామిలీ వైసీపీకి మద్దతు పలికింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. మంచు విష్ణు పెళ్లాడింది కూడా జగన్ చిన్నాన్న కుమార్తెనే దీంతో ఈ ఫ్యామిలీ పార్టీ అభ్యర్థుల తరపున రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేశారు. విష్ణు కూడా చిత్తూరు జిల్లా చంద్రగిరి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరపు ప్రచారంలో పాల్గొన్నారు. చెవిరెడ్డి కూడా భారీ మెజార్టీతో విజయం సాధించారు.