ఓడిపోయినందుకు బాధలేదు.....నేను పార్టీ పెట్టినా.. సినిమాలు......

SMTV Desk 2019-05-27 13:34:23  prakash raj,

ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించిన దక్షిణాది నటుడు ప్రకాశ్ రాజ్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నియోజవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రకాశ్ రాజ్ ఓటమి పాలైన విషయం తెలిసిందే.

ఓటమి తర్వాత మీడియా ముందుకొచ్చిన ప్రకాశ్ మీడియాతో మాట్లాడుతూ..‘ ఓడిపోయినందుకు బాధలేదు. బెంగళూరు ప్రజల హక్కుల కోసం పోరాడతాను. ఇండిపెండెంట్ అభ్యర్థి కావడంతోనే ప్రజలకు నాకు మధ్య గ్యాప్ పెరిగనట్లు అనిపిస్తోంది.అందుకే త్వరలో సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తాను.

ఇంకో ఏడాదిలో బెంగళూరులో కార్పొరేషన్ ఎన్నికలలు జరగనున్నాయి. ఆ ఎన్నికలో మా పార్టీ తరపున అభ్యర్థులను బరిలోకి దించుతాను. వారికి ప్రజల మద్దతు తప్పకుండా ఉంటుంది. నేను పార్టీ పెట్టినా.. సినిమాలు మాత్రం మానను. ఎందుకంటే పార్టీ నడపడానికి డబ్బులు కావాలి. అందుకు సినిమాలు చేస్తునే ఉంటా అని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు.