సాయంత్రం ఏడు గంటలకు మోదీ ప్రమాణ స్వీకారం

SMTV Desk 2019-05-27 13:30:48  modi, Pm modi

వరుసగా రెండో పర్యాయం ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించిన నేపధ్యంలో ప్రధానిగా నరేంద్ర మోడీ రెండవ మారు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపధ్యంలో ఆయన ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కుదిరింది. ప్రధానిగా నరేంద్ర మోడీ ఈ నెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం ఏడు గంటలకు మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు కూడా ప్రమాణం చేస్తారు. ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించిన వివరాలను రాష్ట్రపతి భవన్ నిర్ధారించింది. కేంద్ర కేబినెట్‌లో ఎవరెవరికి ఏ శాఖలు దక్కుతాయన్నది తెలియాల్సి ఉంది. కాగా, అదేరోజు ఏపీలో జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాలకు ప్రమాణం చేసేలా ముహూర్తం నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి మోడీ హాజరయ్యే అవకాశాలున్నాయి. ఏపీ సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మోడీ తిరిగి ఢిల్లీ చేరుకుని పీఎంగా ప్రమాణస్వీకారానికి సన్నద్ధమవుతారని తెలుస్తోంది. అలా ఏపీ ప్రభుత్వానికి తమ అండ ఉంటుందని ఆయన వ్యూహాత్మకంగా చెప్పే ప్రయత్నం చేయనున్నారని అంటున్నారు.