పవన్ కళ్యాణ్ , నాగబాబు పై దారుణమైన కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి

SMTV Desk 2019-05-27 13:26:57  Chandrababu,

తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో న‌టి శ్రీ‌రెడ్డి ఒక‌ప్పుడు సృష్టించిన సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. టాలీవుడ్‌లో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి పోరాటం చేసి ఆ త‌రువాత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను తిట్టి క‌నిపించ‌కుండా పోయింది. మ‌ధ్య‌లో అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాలో ప‌వన్‌కు వ్య‌తిరేకంగా పోస్టులు పెడుతూ శ్రీ‌రెడ్డి వార్త‌ల్లో నిలుస్తూ వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు తాజాగా మ‌రోసారి ప‌వ‌న్‌, ఆయ‌న అన్న నాగ‌బాబుపై ఒక రేంజ్‌లో కామెంట్లు చేసింది. జ‌న‌సేన ఏపీలో దారుణ ఓట‌మి పాల‌వ‌డం ప‌ట్ల సంతోషాన్ని వ్య‌క్తం చేస్తూ శ్రీ‌రెడ్డి ప‌వ‌న్‌, నాగ‌బాబుల‌కు వ్య‌తిరేకంగా ఫేస్‌బుక్‌లో ప‌లు కామెంట్లను పోస్ట్ చేసి వాటిని షేర్ చేసింది. దీంతో ఆ పోస్టులు కాస్తా ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. ఇంత‌కీ అస‌లు శ్రీ‌రెడ్డి ఏమ‌న్న‌దంటే…

”స్నేక్ బాబు ఎక్క‌డ‌, జ‌బ‌ర్ద‌స్త్‌లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు అన్న‌పూర్ణ స్టూడియో గేట్ ద‌గ్గ‌ర వెయిట్ చేస్తున్నాడంట క‌దా..” అంటూ ఆమె ఒక పోస్ట్ పెట్టింది. అలాగే ”ప‌వ‌న్ ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో ఆయ‌న‌కు త‌న ప్ర‌గాఢ సానుభూతిని తెలుపుతున్నా”నంటూ శ్రీ‌రెడ్డి మరో పోస్ట్‌ను ఉంచింది.

అలాగే.. ”ప‌వ‌న్ తాను నంబ‌ర్ వ‌న్ అని ఎప్పుడూ అంటార‌ని.. అది ఎందుకో ఇప్పుడు అర్థ‌మైంద‌ని, ఆయ‌న పార్టీకి కేవ‌లం ఒకే ఒక్క సీట్ వ‌చ్చింద‌ని, అందుక‌నే తాను నంబ‌ర్ వ‌న్ అయి ఉంటాడ‌”ని కూడా శ్రీ‌రెడ్డి పోస్ట్ చేసింది. దాంతోపాటు.. ”మోడీ పోస్ట్ ఇచ్చిన‌ప్పుడే తీసుకుని ఉంటే ఇప్పుడు ప‌రువుపోయేది కాద‌ని, డ‌బ్బులు కూడా మిగిలేవి క‌దా..” అని కూడా శ్రీరెడ్డి కామెంట్ చేసింది. దీంతో ఇప్పుడు శ్రీ‌రెడ్డి ఫేస్‌బుక్‌లో ఉంచిన ఆ పోస్టులు వైర‌ల్ అవుతున్నాయి. అయితే ఈ పోస్టుల‌పై ప‌వ‌న్ అభిమానులు కానీ, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు కానీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి..!