ఆశ్చర్యం: బెంగళూరులో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం

SMTV Desk 2019-05-27 13:10:30  white snake

పచ్చని వృక్షసీమలకు పెట్టింది పేరైన బెంగళూరు మహానగరంలో అరుదైన శ్వేతనాగు దర్శనమిచ్చింది. సిలికాన్ సిటీలోని న్యాయంగ లేఅవుట్ వద్ద పూర్తిగా తెలుగు రంగులో మెరిసిపోతున్న నాగుపామును చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. సాధారణ నాగుపాముకు భిన్నంగా తెల్లగా కాంతులీనుతున్న ఆ విషసర్పాన్ని చూసిన ప్రజలు వెంటనే ప్రముఖ స్నేక్ క్యాచర్ మోహన్ కు సమాచారం అందించారు. కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన మోహన్ ఆ పామును ఎంతో చాకచక్యంగా పట్టుకుని అందరికీ చూపించారు. ఇది చాలా అరుదైన సర్పం అని, ఇలాంటివి సాధారణంగా అడవుల్లో ఉంటాయని తెలిపారు. అనంతరం, ఆ శ్వేతనాగును సమీపంలోని అటవీప్రాంతంలో వదిలిపెట్టేందుకు తీసుకెళ్లారు.