మే 30న జగన్ ప్రమాణ స్వీకారం.. మే 31న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల

SMTV Desk 2019-05-27 12:32:02  varma

సంచలన దర్శకుడు రామ్ గోపాల్‌వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ఏపీలో విడుదలకు సిద్ధమైంది. ఏపీలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో సినిమా విడుదలను నిలిపివేశారు. ఇక ఎన్నికల కోడ్ ముగియనుండడంతో ఈ సినిమాను మే 31న విడుదల చేయబోతున్నట్టు వర్మ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మే 30న వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని, మే 31న సినిమాను అక్కడ విడుదల చేస్తామని వర్మ పేర్కొన్నారు. ఈ రెండు కార్యక్రమాలు వైఎస్సార్, ఎన్టీఆర్ ఆశీస్సులతో జరగనున్నాయని వర్మ ట్వీట్‌లో తెలిపారు.