దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన సిరిల్ రామఫోసా

SMTV Desk 2019-05-27 12:14:11  South africa,

ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఎఎన్‌సి) అధినేత సిరిల్ రామఫోసా శనివారం దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన ఆ పదవిలో అయిదేళ్లు ఉంటారు. ఈ నెలలో ఆరోసారి సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత పార్లమెంట్ ఆయనను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. 66 ఏళ్ల రామఫోసా రాజధానిలోని లోఫ్టస్ వెర్స్‌ఫీల్డ్ స్టేడియంలో వేలాదిమంది ప్రముఖులు, అధికారులు, పౌరుల సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు. వివిధ దేశాధినేతలు, మాజీ దేశాధినేతలు, అంతర్జాతీయ, ప్రాంతీయ సమాఖ్యల అధిపతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సాధారణంగా కొద్దిమంది ఆహ్వానితుల సమక్షంలో జరిగే దేశాధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమం మొదటిసారి ప్రజల సమక్షంలో జరగడం విశేషం. ఈ వారం ప్రారంభంలో ప్రధాన న్యాయమూర్తి మొగోయంగ్ మొగోయంగ్ పర్యవేక్షణలో నేషనల్ అసెంబ్లీ రామఫోసాను దేశాధినేతగా ఎన్నుకుంది.