ఫేస్ బుక్ లో లైక్స్ వస్తే లొంగిపోతా అంటున్న తుంటరి దొంగ

SMTV Desk 2019-05-26 17:08:03  facebook, likes, facebook photo likes

జోస్ సిమ్స్.. ఓ తుంటరి దొంగ. ఇతడిపై ఏడు కేసులు నమోదయ్యాయి. పోలీసులు అతడిని అరెస్టు చేసేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించారు. అలా కనిపించి చిటికెలో మాయమయ్యే వాడు. ఇటీవల పోలీసులకు ఓ డిమాండ్ చేశాడు. ‘నా ఫొటోను ఫేస్ బుక్‌‌‌‌లో పోస్టు చేయండి. దానికి 15 వేల లైకులొస్తే లొంగిపోతా’ అని చెప్పాడు. దీంతో టొరింగ్టన్ పోలీసులు అలానే చేశారు. పోస్టు చూసిన నెటిజన్లు సిమ్స్ ఫొటోకు తెగ లైకులు కొట్టారు. దొంగ కోరుకున్న దాని కంటే ఎక్కువ మంది అతడి ఫొటోను ఇష్టపడ్డారు. కానీ అతడు మాత్రం పోలీసులకు లొంగిపోలేదు.