సాహోలో సల్మాన్ ఖాన్ ఉన్నట్టా లేనట్టా

SMTV Desk 2019-05-26 16:50:46  salman khan, saaho

బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న ప్రెస్టిజియస్ మూవీ సాహో ఆగష్టు 15న రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. ఈమధ్యనే వచ్చిన క్రేజీ పోస్టర్ సినిమాపై మరింత అంచనాలు పెంచింది. సుజిత్ డైరక్షన్ లో యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమా 250 కోట్ల పైన బడ్జెట్ తో తెరకెక్కుతుంది. రీసెంట్ గా ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కెమియో రోల్ ఉందని వార్తలు వచ్చాయి.

తెలుగు, తమిళ, హింది భాషల్లో వస్తుంది కనుక స్పెషల్ ఎట్రాక్షన్ గా సల్మాన్ ఉంటాడని అంతా అనుకున్నారు. కాని సాహో డైరక్టర్ సుజిత్ ఈ వార్తలను ఖండించారు. సాహోలో సల్మాన్ ఖాన్ అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అన్నారు. ప్రభాస్ సోలోగానే ఈ సినిమా చేస్తున్నాడని వివరణ ఇచ్చారు. అయితే అంచనాలకు తగినట్టుగానే ఈ సినిమా ప్రభాస్ రేంజ్ మరింత పెంచేలా ఉంటుందని నమ్మకంగా చెబుతున్నాడు సుజిత్. మేకింగ్ వీడియోస్, పోస్టర్స్ సినిమాపై మరింత అంచనాలు పెంచాయి. మరి సాహో తో ప్రభాస్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.