మిలిటెంట్లను విచారించేందుకు ఇంటర్నేషనల్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటు..!

SMTV Desk 2019-05-25 22:16:07  international tribunal, Dutch Foreign Minister Stef Blok

ఆమ్‌స్టర్‌డామ్‌: నెదర్లాండ్‌ విదేశాంగ మంత్రి స్టెఫ్‌ బ్లాక్‌ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మిలిటెంట్లను విచారించేందుకు ఇంటర్నేషనల్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలని అయన డిమాండ్ చేశారు. అలాగే మధ్య ప్రాఛ్య దేశాల్లో ఐఎస్‌ ఆగడాలు శృతిమించాయని అన్నారు. మిలిటెంట్ల హింసాకాండ కారణంగా వేలాది మంది మృతి చెందుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అమానవీయ చర్యలకు పాల్పడుతున్న మిలిటెంట్లపై హత్యానేరాలు నమోదు చేయాలని, వీరిని విచారించేందుకు ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఐరాసలో ఆయన ఈమేరకు వ్యాఖ్యలు చేశారు. మిలిటెంట్లు నిర్వహిస్తున్న మారణహౌమంలో చిన్నారులు, మహిళలు అధిక సంఖ్యలో మృతిచెందుతున్నారని అన్నారు. సిరియా, ఇరాక్‌ దేశాల్లో మిలిటెంట్ల నిర్మూలన కోసం ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా కృషి చేయాలని, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు నిర్వహించాలని స్టెఫ్‌ బ్లాక్‌ పిలుపునిచ్చారు.