ధోనిపై అంచనాలు పెరిగాయి!

SMTV Desk 2019-05-25 22:11:44  mahendra singh dhoni, team india, icc world cup 2019, sachin tendulkar

వేల్స్‌: మహేంద్ర సింగ్ ధోనిపై ఈ వరల్డ్ కప్ ట్రోఫీలో చాలా అంచనాలు ఉన్నాయి. ప్రతీ ఒక్క ఆటగాడి కన్ను కూడా ధోనివైపు మళ్ళింది. ఇటీవల ముగిసిన ఐపిఎల్‌లో అతని ప్రదర్శనే ఇందుకు కారణం. మ్యాచ్‌ గెలుపోటములు గురించి పక్కన పెడితే జట్టును నడిపించడంలో ధోనిది కీలకపాత్ర. దీంతో ధోనిపై అమాంతం అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాస్టర్‌ బ్లాస్టర్‌ కూడా ఈ విషయమై కొన్ని ఆసక్తికర విషయాలు మీడియాతో పంచుకున్నారు. ఈ ప్రపంచ కప్‌లో కోహ్లికి తోడు ధోని ఉండటం ఎంతో అవసరమనిన పేర్కొన్నాడు. వికెట్‌ కీపర్‌గా అనుభవం, సమయస్పూర్తి టీమిండియాకు ఎంతో కీలకం కానున్నాయి. స్టంప్స్‌ వెనకాల నిలబడి అతను మైదానాన్ని మొత్తం పరిశీలిస్తాడు. బ్యాట్స్‌మెన్‌ తీరును పసిగట్టగలడు. బౌలర్‌ బంతి వేయడం ప్రారంభించాక బ్యాట్స్‌మెన్‌ కంటే ధోనీనే బంతిని బాగా గమనిస్తాడు. అందుకే స్టంప్స్‌ వెనుక ఎంతో అనుభవమున్న ధోని టీమిండియాకు ప్లస్‌ అని సచిన్‌ పేర్కొన్నారు. కోహ్లి గురించి మాట్లాడుతూ..కోహ్లి ఐపిఎల్‌లో విఫలమైనంత మాత్రాన అతడి నైపుణ్యాన్ని విమర్శించడం, ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీయడం సరికాదు అని అభిప్రాయపడ్డారు.