విజయ్‌ శంకర్‌కు గాయం!

SMTV Desk 2019-05-25 22:11:04  vijaya shankar, team india, icc world cup 2019

లండన్‌: టీంఇండియా ఆటగాడు విజయ్‌ శంకర్‌ నేడు న్యూజిలాండ్‌తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్ సందర్భంగా నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తుండగా గాయపడటంతో ప్రాక్టీస్‌ సెషన్‌ మధ్యలోనే అతడు వెనుదిరిగాడు. అయితే అతడి గాయం త్రీవతపై టీమిండియా మేనేజ్‌మెంట్‌ ఈరోజు స్పందించింది. శుక్రవారం సాధన చేస్తుండగా విజయ్‌ శంకర్‌ కుడిచేతికి దెబ్బతగిలింది. దీంతో అతన్ని ఇవాళ హాస్పిటల్‌కు తీసుకెళ్లి.. స్కానింగ్‌ తీయించాం. చేతికి ఫ్రాక్చర్‌ కాలేదని వైద్యులు తెలిపారు. అతడు త్వరగా కోలుకునేందుకు బీసీసీఐ మెడికల్‌ టీమ్‌ అతనికి చికిత్స అందిస్తోంది. అని బీసీసీఐ ట్విటర్‌ వేదికగా పేర్కొంది.