విజయ్ దేవరకొండ ఒక అమితాబ్, తెలంగాణ తొలి మెగాస్టార్ : రామ్ గోపాల్ వర్మ

SMTV Desk 2017-08-26 15:19:31  ARJUN REDDY MOVIE, RAMGOPAL VARMA, VIJAY DEVARAKONDA, MEGASTAR, AMITHAAB

హైదరాబాద్, ఆగస్ట్ 26 : సంచలన ప్రకటనలు చేయడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందుంటారు. ఆయన పొగడ్తలు ఆకాశానికి ఎత్తేలా ఉంటాయి. అసలు ఎవరిని ఎప్పుడు విమర్శిస్తారో.! ఎప్పుడు ఆకాశానికి ఎత్తుతారో..! ఊహించడం కష్టం. ఆలాంటిది తాజాగా వర్మ మరో సంచలన కామెంట్ చేసారు. ఇటీవల హీరో విజయ్ దేవరకొండ నటించిన "అర్జున్ రెడ్డి" చిత్ర౦ పలు విమర్శలకు దారి తీసింది. ఈ క్రమంలో నిన్న విడుదలైన ఈ చిత్రాన్ని చూసిన వర్మ తనదైన శైలిలో స్పందిస్తూ.. ఈ తరంలో హీరోలంతా తమ హీరోయిజాన్ని చూపిస్తుంటే అందుకు భిన్నంగా విజయ్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకు వచ్చాడని వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా "తెలంగాణ తొలి మెగాస్టార్ విజయ్, తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన అమితాబ్" లా మారతాడని ప్రశంసల వర్షం కురిపించారు. మరి వర్మ పొగడ్తలపై మన హీరో ఏమంటారో చూడాలి..