ఫేస్‌బుక్‌లో 300 కోట్ల ఫేక్ అకౌంట్లు తొలగింపు

SMTV Desk 2019-05-25 18:04:27  Facebook removed 300 crores Facebook fake accounts

వాషింగ్టన్‌: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫేస్‌బుక్‌ నకిలి పోస్టులు అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో 2018 అక్టోబరు నుండి 2019 మార్చి వరకు 300 కోట్లకు పైగా నకిలి ఖాతాలను తొలగించింది. 2018 అక్టోబరు, డిసెంబరు మధ్య 120కోట్లు, 2019 జనవరిమార్చి మధ్య 219కోట్ల నకిలీ ఖాతాలను తమ ప్లాట్‌ఫాం నుంచి తొలగించినట్లు సంస్థ తెలిపింది. క్రితం ఆరు నెలలతో పోలిస్తే ఈసారి రెట్టింపు సంఖ్యలో నకిలీ ఖాతాలను తొలగించింది. అయితే ఈ ఖాతాలతో నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తుండటమే గాక.. ఈ ఖాతాల్లో అభ్యంతరకర కంటెంట్‌ ఉన్నందునే ఈ చర్యలు తీసుకున్నట్లు ఫేస్‌బుక్‌ వెల్లడించింది. అంతేగాక.. ఈ ఖాతాదారులు ఫేస్‌బుక్‌ విధివిధానాలను ఉల్లంఘించడం కూడా ఓ కారణమని పేర్కొంది.