ఎక్కువ మంది ఎంపీలు....ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు

SMTV Desk 2019-05-25 18:01:25  karnataka

కర్ణాటకలో లింగాయత సామాజిక వర్గానికి చెందిన వారే అత్యధిక మంది ఎంపీలు ఎన్నికయ్యారు. ఎస్సీ రిజర్వేషన్‌ 5, ఎస్టీ రిజర్డు 2 స్థానాలు మినహాయిస్తే మిగిలిన 21 స్థానాలలో ఏకంగా 9మంది లింగాయతులు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 7 మంది ఒక్కలిగులు, ముగ్గురు బ్రాహ్మణులు, ఇరువురు ఓబీసీ సామాజికవర్గానికి చెందినవారు ఉన్నారు.

లింగాయత సామాజిక వర్గానికి చెందినవారిలో తుమకూరు - బసవరాజ్‌, చిక్కోడి - అణ్ణాసాహెబ్‌ జొల్లె, బెళగావి - సురేశ్‌ అంగడి, బాగల్కోటె - పి.సి.గద్దిగౌడర్‌, బీదర్‌ - భగవంత్‌ఖూబా, కొప్పళ్‌ - కరడిసంగణ్ణ, హావేరి - శివకుమార్‌ ఉదాసి, దావణగెరె - జి.ఎం.సిద్దేశ్వర్‌, శివమొగ్గ - బి.వై.రాఘవేంద్రలు ఉన్నారు.

ఒక్కలిగ సామాజికవర్గానికి చెందినవారిలో ఉడిపి-చిక్కమగళూరు నుంచి శోభాకరంద్లాజే, హాసన్‌ - ప్రజ్వల్‌గౌడ, దక్షిణకన్నడ - నళిన్‌కుమార్‌ కటీల్‌, మైసూ రు - ప్రతా్‌పసింహ, బెంగళూరు గామీణ - డి.కె.సురేశ్‌, బెంగళూరు ఉత్తర - సదానందగౌడ, చిక్కబళ్ళాపుర - బచ్చేగౌడలు ఉన్నా రు. బ్రాహ్మణ సామాజిక వర్గంలో బెంగళూరు దక్షిణ - తేజస్వి సూర్య, ధార్వాడ - ప్రహ్లాద్‌ జోషి, ఉత్తరకన్నడ - అనంతకుమా ర్‌ హెగ్డేలు ఉండగా ఓబీసీ వర్గానికి చెందినవారిలో మండ్య నుంచి సుమలత, బెంగళూరు సెంట్రల్‌ నుంచి పి.సి.మోహన్‌ ఉన్నా రు. ఎస్టీ సామాజిక వర్గంలో బళ్ళారి - దేవేంద్రప్ప, రాయచూరు - రాజా అమరేశ్‌ నాయక్‌లు, ఎస్సీ సామాజిక వర్గంలో చిత్రదుర్గ - ఎ.నారాయణస్వామి, చామరాజనగర్‌ - శ్రీనివాస ప్రసాద్‌, కోలారు - మునిస్వామి, బిజాపూర్‌ - రమేశ్‌ జిగజిణగి, గుల్బర్గా - ఉమేశ్‌జాథవ్‌లు ఉన్నారు.