"సైరా" లో మరో హీరోయిన్ గా అనుష్క..??

SMTV Desk 2017-08-26 14:30:05  SIARA NARASIMHAREDDY, MOVIE, HEROINE ANUSHKA, NAYANATHARA, AISHWARYA RAI

హైదరాబాద్, ఆగస్ట్ 26 : మెగాస్టార్ కథానాయకుడిగా తెరకెక్కనున్న "సైరా నరసింహా రెడ్డి" వంటి చారిత్రాత్మక చిత్రంలో ముగ్గురు కథానాయికలను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలో నయనతారను ఎంపిక చేసిన చిత్ర బృందం, మరో కథానాయిక కోసం ఇప్పటికే ఐశ్వర్య రాయ్ ను సంప్రదించినట్టు సమాచారం. ఈ సినిమాలో మరో కథానాయికకు అవకాశ౦ ఉండడంతో అనుష్కను తీసుకునే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అమ్మడు ఇదివరకే "స్టాలిన్" సినిమాలో చిరంజీవి సరసన ఒక స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఆ తర్వాత చిరంజీవి 150 సినిమా కోసం కూడా ఆమెను సంప్రదించగా తనకు డేట్స్ కుదరకపోవడంతో ఆ ఛాన్సు వదులుకున్నారు. మరి ఇప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందనే అంతా భావిస్తున్నారు.