సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి: డీకే అరుణ

SMTV Desk 2019-05-25 17:52:40  kcr

మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానంలో టీఆర్ఎస్ నేతలకు చెమటలు పట్టించే విధంగా ఎన్నికలు జరిగాయని బీజేపీ నేత డీకే అరుణ చెప్పారు. నిజామాబాద్‌లో మాజీ ఎంపీ కవిత ఓటమికి నైతిక బాధ్యత వహించి సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో రాహుల్ గాంధీయే ఓడిపోయే పరిస్థితి వచ్చిందంటే.. ఇక కాంగ్రెస్ పార్టీ ఖతమైపోయిందనే చెప్పవచ్చు, కాంగ్రె‌స్‌ నేతలంతా బీజేపిలోకి రావాలని డీకే అరుణ సూచించారు.